Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నల్గొండ జిల్లాలో ప్రమాదం.. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు దగ్ధం!

నల్గొండ జిల్లాలో ప్రమాదం.. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు దగ్ధం!

చిట్యాల, మే 30: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఈ (శనివారం) తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది.

హైదరాబాద్ నుంచి కాకినాడకు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు ప్రయాణికులతో బయలుదేరిన ఈ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారిపై చిట్యాల మండలం పెద్దకాపర్తి పరిధిలోకి రాగానే ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే వారు బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, లోపల ఉన్న ప్రయాణికులను గట్టిగా అరుస్తూ కిందకు దిగిపోవాలని సూచించారు.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురవుతూ బస్సులో నుంచి కిందకు దూకేశారు. అందరూ సురక్షితంగా దిగిన కొన్ని నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడినప్పటికీ.. బస్సు లగేజ్ క్యాబిన్‌లో ఉన్న వారి విలువైన సామగ్రి మొత్తం మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

బస్సులో మంటలు చెలరేగడానికి బ్యాటరీ లేదా ఇంజిన్ విభాగంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy