Saturday, 06 Mar, 11.39 am ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
నందిగ్రామ్ ప్రజలు 'అవుట్ సైడర్స్' ను కోరుకోవడం లేదు : మమతకు సుబేందు రివర్స్ కౌంటర్

కోల్‌కతా : బీజేపీ 'అవుట్ సైడర్స్ పార్టీ' అంటూ సీఎం మమత పదే పదే బీజేపీని ఇరుకున పెడుతున్నారు. బీజేపీ కూడా అంతే కౌంటర్ ఇస్తోంది. తమ పార్టీ స్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఎక్కడి వారు? బెంగాలీ కాదా? అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అయితే సీఎం మమత నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించగానే ప్రత్యర్థి సుబేందు అధికారి గట్టి కౌంటర్ ఇచ్చారు. ''నందిగ్రామ్ నుంచి సీఎం మమత బరిలోకి దిగడాన్ని మేం ఆహ్వానిస్తున్నాం. మిడ్నాపూర్ బిడ్డనే ప్రజలు కావాలనుకుంటున్నారు. అవతలి వ్యక్తులను ఏమాత్రం కోరుకోవడం లేదు. నందిగ్రామ్ ప్రజల ప్రబలమైన డిమాండ్ ఇదే. మిమ్మల్ని యుద్ధ క్షేత్రంలో చూసుకుంటాం. మే 2న మీరు ఓడిపోతారు. క్షేత్రం నుంచి నిష్క్రమిస్తారు.'' అంటూ సుబేందు ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top