అమరావతి: నరేగా పనులపై హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2018-2019 బిల్లులు ఇవ్వకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రూ.25 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు ధర్మాసనం గుర్తించింది. రూ.7 లక్షల 60 వేలకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. పిటిషనర్ల తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

