కోల్‌సిటీ, మే 24 (ఆంధ్ర జ్యోతి): నేరాల నియంత్రణ కు ప్రజలు సహకరించాలని, ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్ అని డీసీపీ రాం రెడ్డినాయక్ అన్నారు.
గోదావ రిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరి ధిలో తిలక్‌నగర్‌లో నేర నియంత్రణ, ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం రాత్రి వన్‌టౌన్ సీఐ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వ హించారు. డీసీపీ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తమ వాహనపత్రాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని సూచిం చారు. ప్రాణరక్షణకు ప్రతి ఒక్కరూ హెల్మె ట్ ధరించాలని డీసీపీ స్పష్టం చేశారు. ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తుందో తెలియదని, ప్రతీ ప్రయాణంలోనూ హెల్మె ట్ ధరించాలన్నారు.
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడపటం, అతివేగంతో ప్రయా ణించడం వల్ల మీతోపాటు ఇతరుల ప్రాణా లకు ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతం గా ప్రయాణం చేయాలని పిలుపుని చ్చారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత లింకులను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చే సమాచారా న్ని గోప్యంగా ఉంచుతామని ప్రజల చొర వతోనే సమాజంలో నేరాలను అరికట్టడం సాధ్యమన్నారు. గంజాయి రవాణా విక్ర యాలపై ఎలాంటి సమాచారం అందినా వెంటనే నిర్మూలించేందుకు చర్యలు చేపడ తామని స్పష్టం చేశారు. ఏసీపీ మడత రమేష్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

