(భీమవరం)
మహాత్మాగాంధీ సతీమణి కస్తూరిబా పేరిట నడుస్తున్న కళాశాలను 'చరిత్ర'లో కలిపేశారు. ఆ కళాశాలకు వైసీపీ ఎమ్మెల్యే తండ్రి పేరు పెడుతూ జీవో జారీచేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కస్తూరిబా కాలేజీకి ఎంతో పేరుంది. దీనిని చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ఏర్పాటు చేశారు. ఆయన తనకున్న దాదాపు 3 వేల ఎకరాలను విద్యాసంస్థల ఏర్పాటుకు దానం చేశారు.
ఏ ఒక్క సంస్థకూ తన పేరు పెట్టుకోలేదు. భీమవరంలో ఏర్పాటు చేసిన కాలేజీకి కస్తూరిబా పేరు పెట్టారు. ఈ కాలేజీకి దిరుసుమర్రు గ్రామానికి చెందిన దాత స్థలం విరాళంగా ఇచ్చారు. కళాశాలను 1977లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తమ స్థలం ఇచ్చేయాలని దాత వారసులు కోర్టును ఆశ్రయించగా ఐదేళ్ల కిందట వారికి అనుకూలంగా తీర్పువచ్చింది.

