Dailyhunt

నేడు హైకోర్టులో చీరాల దళిత యువకుడి మృతి కేసుపై విచారణ

అమరావతి: చీరాల దళిత యువకుడు కిరణ్‌కుమార్ మృతి కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. కిరణ్ కుమార్ తరపున మాజీ ఎం పి హర్షకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. బాధితుడి తరపున హైకోర్టు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. మాస్క్ లేని కారణంగా ఎస్ఐ కొట్టడంతో కిరణ్‌కుమార్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy