(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
బంగళాఖాతంలో అల్పపీడనం వల్ల రాష్ట్రంలో ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం కూడా రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం.. ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
కాగా, గత 24 గంటల్లో కుమరంభీం-ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో అత్యధికంగా 9.35 సెం.మీ, ఖమ్మం జిల్లా కారేపల్లిలో అత్యధికంగా 6.5 సెం.మీ, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గం పహడ్‌లో 6.45 సెం.మీ, మంచిర్యాల జిల్లా భీమిని, జయశంకర్-భూపాలపల్లి జిల్లా పలిమెలలో 4.8, అదే జిల్లా ముత్తారంలో 4.3 సెం.మీ వర్షపాతం రికార్డైందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షంతో ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు, కుమరం భీం ప్రాజెక్టులోకి 2,172 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 1378 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు.
ఈ వార్తలు కూడా చదవండి:

