సోషల్ మీడియాను విరివిగా వాడుకునే వ్యక్తుల్లో రామ్‌గోపాల్ వర్మ ఒకరు. అలాంటి ఆయనకు కూడా ఇప్పుడు మహా బోర్ కొడుతుందట. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా వైరస్ ప్రభావంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ''నేను ఎప్పుడూ నెలకు 30రోజులని అనుకునేవాడిని. కానీ మొదటిసారి 1000 రోజులు ఉన్నట్లు అనిపిస్తుంది. సమయం ముందుకు సాగడం లేదు. కరోనాకు భయపడి సమయంతో అన్నీ ఆగిపోయాయి. లాక్ డౌన్ పనిచేస్తుంది. కరోనా పనిచేయడం లేదని భావిస్తున్నా'' అంటూ వర్మ ట్వీట్ చేశాడు.

