Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

ఇంటర్‌నెట్ డెస్క్: మెరుపు వరదలపై నేపాల్ ఎంబసీ బుధవారం సాయంత్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. నేపాల్‌లో భారీ వరదలు సంభవించాయని, వరదల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు పలువురు గల్లంతయ్యారని వెల్లడించింది.

ఇళ్లు, రోడ్లు, వంతెనలు, హైడ్రోపవర్ ప్రాజెక్టులకు భారీ నష్టం జరిగిందని పేర్కొంది. నేపాల్ భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయని తెలిపింది.

దిగువ ప్రాంతాలకు వరద ముప్పుపై నేపాల్ ప్రభుత్వం అలర్ట్ చేసిందని వెల్లడించింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. విదేశీ సాయం అవసరంపై ఖాట్మాండు నుంచే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. భారత్‌తో సమన్వయానికి సిద్ధంగా ఉన్నామని నేపాల్ ఎంబసీ స్పష్టం చేసింది.

నేపాల్ ప్రధానికి మోదీ ఫోన్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. నేపాల్ ప్రధాని బాలెన్ షాతో బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. మెరుపు వరదల కారణంగా జనం ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టారు.

>

అమరావతి అసెంబ్లీకి సరికొత్త డిజైన్‌: మంత్రి మనోహర్‌

టెస్టుల్లో జడేజా షాకింగ్ రికార్డు.. ఏకంగా 88 నో బాల్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy