Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. ఏపీ వాసులపై ఆరా

నేపాల్ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. ఏపీ వాసులపై ఆరా

మరావతి, ఆగస్టు 27: నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన వారు ఎవరైనా చిక్కుకున్నారా అనే అంశంపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది.

విపత్తులో చిక్కుకున్న రాష్ట్ర వాసులను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులకు సహాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు.

అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్(RTGS) నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, నేపాల్‌లో చిక్కుకున్న బాధిత యాత్రికులకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నేపాల్‌లో వరదల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీ వాసులు, వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి సమాచారం అందించవచ్చు.

ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:

  • 011-23384016

  • 011-23387089

  • వాట్సాప్: 9059824101


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy