Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ వరదలు.. 734కు చేరిన మృతుల సంఖ్య.. 2,500 మంది గల్లంతు

నేపాల్ వరదలు.. 734కు చేరిన మృతుల సంఖ్య.. 2,500 మంది గల్లంతు

ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 734కు చేరింది. 2500 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైనవారిలో విదేశీయులు, భారతీయులు ఉన్నట్టు సమాచారం.

వందలాది గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక సిబ్బంది ఇప్పటివరకు 4,400 మందిని రక్షించారు. టిబెట్‌లో చిక్కుకున్న 120 మంది భారతీయులను నేపాల్‌కు తరలించారు. ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్ సాయం

వరదల కారణంగా తల్లడిల్లిపోతున్న నేపాల్‌కు భారత్ సాయం అందిస్తోంది. 11 టన్నుల సామాగ్రితో నాలుగో విమానం నేపాల్‌కు వెళ్లింది. భారత్ 5 రోజుల్లో 68.5 టన్నుల సహాయమందించింది. అంతేకాదు.. రెస్క్యూ కోసం భారత సాంకేతిక బృందం నేపాల్‌కు వెళ్లింది. వంతెనల నిర్మాణానికి కూడా భారత్ 16 ట్రక్కుల సామాగ్రి పంపింది. నేపాల్‌కు సహాయక చర్యలు కొనసాగుతాయని భారత విదేశాంగశాఖ తెలిపింది.

కాగా, భోటేకోశీ నది వెంట ఉన్న 8 జిల్లాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో తీవ్రంగా నష్టం జరిగింది. మధ్యనేపాల్‌లోని రసువా, త్రిశూలి ప్రాంతాల్లో విధ్వంసం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు, నీరు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసమయ్యాయి. చాలా ఇళ్లు కొన్ని అడుగుల మేర బురదలో కూరుకుపోయి కనిపిస్తున్నాయి. వాహనాలు, వస్తువులు, ఇతర సామగ్రిలో చాలా వరకు నీటిలో కొట్టుకుపోయాయి, బురద కింద కూరుకుని దెబ్బతిన్నాయి.

>

అప్పుడు సంజు రియాక్షన్ చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

తూర్పు కనుమల్లో 'జలమిత్రులు'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy