కర్నూలు (కల్చరల్), ఏప్రిల్ 22: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు శుక్రవారం నుంచి మారుతున్నట్లు లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ (ఎల్‌డీఎం) వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల పనివేళలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే ఉంటాయని తెలిపారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు సబ్ కమిటీ ప్రొసీడింగ్స్ ప్రకారం ప్రతి బ్యాంకులోనూ డిపాజిట్ల స్వీకరణ, నగదు చెల్లిం పులు, ఇతర లావాదేవీలు యఽథావిధిగా కొనసాగు తాయని, మధ్యాహ్నం 2 గంటల్లోపు మాత్రమే ఉంటాయన్నారు. ఖాతాదారులు అతి ముఖ్యమైన పనులకు మాత్రమే బ్యాంకులకు రావాలని, నగదు విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్లు వంటివి ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవాలని తెలిపారు
