Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి రాశి ఫలాలు...  6-08-2026

నేటి రాశి ఫలాలు... 6-08-2026

నేటి రాశిఫలాలు 6-08-2026 (గురువారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం.

చిన్నారులు ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. టెలివిజన్‌, విద్య, ఆడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సాయినాధుని ఆరాధన శుభప్రదం.

వృషభం (ఏప్రిల్‌ 21- మే 20 మధ్య జన్మించిన వారు)

స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. మీ మనసు మార్పును కోరుకుంటుంది. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువుల కొనుగోలులో నాణ్యత గమనించాలి. లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్ర పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

సినీ, రాజకీయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. ఉన్నత విద్యా ప్రయత్నాలకు అవరోధాలు కలుగుతాయి. ఒక సమాచారం ఆవేదన కలిగస్తుంది. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్త తీసుకోవాలి. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఖర్చులు అంచనాలు మించుతాయి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలకు తగిన సమయం కాదు. కొత్త వ్యూహాలు అమలును ఈ రోజుకు వాయిదా వేయడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలి. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

మనసు చికాకుగా ఉంటుంది. ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రులతో ఆనందం గడుపుతారు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయాణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సకాలంలో డబ్బు చేతికి అందకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దత్త కవచ పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమావేశాలు, వేడుకలకు ఖర్చులు అధికం. బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ప్రభుత్వరంగ సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాలి. గోసేవ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 22 మధ్య జన్మించిన వారు)

సహోద్యోగుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు నిదానం పాటించాలి. విందు వినోదాలకు ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. సాయినాధుని ఆరాధన శుభప్రదం.

మకరం (డిసెంబరు 23-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల కోసం ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్య కోసం అవసరమైన నిధులు సకాలంలో అందకపోవచ్చు. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. దత్త కవచ పారాయణ శుభప్రదం.

కుంభం ( జనవరి 21- ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గోమాతను ఆరాధించండి.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఒక సమాచారం కలవరపెడుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సహోద్యోగులతో ఆనందంగా గడుపుతారు. దత్త కవచ పారాయణ శుభప్రదం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy