Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి రాశి ఫలాలు శుక్రవారం, 28-8-2026

నేటి రాశి ఫలాలు శుక్రవారం, 28-8-2026

నేటి రాశి ఫలాలు శుక్రవారం, 28-8-2026

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు ఫలిస్తాయి. ఊరేగింపులు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

వృషభం ( ఏప్రిల్‌ 21-మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక సంస్థలు, యూనియన్‌ వ్యవహారాల్లో పాల్గొంటారు. బందుమిత్రులతో విందు వినోదాల్లో ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, వృత్తిపరమైన మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. కటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్య సాధనలో పెద్దల సహకారం అందుతుంది.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి శుభప్రదం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థికపరమైన చర్చలకు అనుకూలం. ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. వైద్యం, సేవల రంగాల వారికి అనుకూలం. బీమా, పెన్షన్‌, డిపాజిట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తవుతాయి. విలువైన పత్రాలు అందుకుంటారు.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

స్పెక్యులేషన్లు లాభిస్తాయి. షాపింగ్‌, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహరంగా ఉంటుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. బందుమిత్రులను కలుసుకుంటారు.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో మార్పుల గురించి ఆలోచిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్‌ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

స్నేహాలు, అనుబంధాలు బలపడతాయి. సినిమాలు, టెలివిజన్‌, కళలు, క్రీడల రంగాల వారు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. చిన్నారులకు సంబంధించిన ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఆర్థిక సమీక్షలకు, సర్దుబాట్లకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కమ్యూనికేషన్‌ రంగాల వారికి ప్రోత్సాహ కరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అగ్రిమెంట్లు, రాతకోతలకు అనుకూలం. మెయిల్స్‌, సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయు.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి విషయంలో శుభపరిణామాలు సంభవం. లక్ష్య సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy