Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలి

నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలి

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : మరణానంతరం నేత్ర దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ కోరారు.

కలెక్టరేట్‌లో మంగళవారం నేత్రదాన పక్షోత్సవాల సంద ర్భంగా ఈనెల 8వ తేదీవరకు నిర్వహిస్తున్న 15రోజుల అవగాహన కార్య క్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్‌లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేత్రదానం మహాదానం అని, మర ణానంతరం నేత్రదానం చేయడంతో ఇద్దరు అంధులకు చూపును ప్రసా దించే అవకాశం ఉంటుందన్నారు. నేత్రదానంపై ప్రజలల్లో ఉన్న అపోహ లను తొలగించి ప్రతి ఒక్కరు నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నేత్రదానం చేయాలనుకునే వారు మరణించిన ఆరు గంట లలోపు నేత్రదాన కేంద్రం ఫోన్‌ నంబర్‌ 9849545822కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైధ్యాధికారి ఏజేంలా అల్ర్పెడ్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సుభాషిణి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ నాగేందర్‌ బాబు, డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా అంధత్వ నియం త్రణ అధికారి డాక్టర్‌ నయిమ్‌జహా తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy