హైదరాబాద్, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Maha Ganapathi) ఆగమన్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
భక్తుల రద్దీతో ఖైరతాబాద్ సందడిగా మారింది. మేళతాళాలు, నృత్యాలతో గణనాథుడికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. గణేశ్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
మహాగణపతి ఆగమన్‌తో భక్తుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. లంబోదరుడి ఉత్సవాల నేపథ్యంలో ఖైరతాబాద్‌లో పండుగ వాతావరణం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..

