Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు:  పవన్ కల్యాణ్

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్

మరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రగతి ఎంత ముఖ్యమో... ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు.

పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ ఈరోజు (బుధవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రీన్‌బెల్ట్ నిర్వహణ, శబ్దకాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. కాలుష్యాన్ని నియంత్రించి ఉత్తరాంధ్రలోని గోస్తని నదిని కాపాడుదామని పిలుపునిచ్చారు.

ప్రజల ఆరోగ్యం ముఖ్యం..

కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లో బాధితులను భాగస్వామ్యం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో... ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని నిర్దేశించారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలను పక్కనబెట్టి జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదని పేర్కొన్నారు. పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. శబ్దకాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి కేవలం నివేదికలకే పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy