ఢిల్లీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నిస్తే దాడులా?, విశ్లేషిస్తే దౌర్జన్యాలా? అని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకల దాడి అత్యంత దారుణమని అన్నారు. మీడియా స్వేచ్ఛను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని చెప్పారు. నిజాలు మాట్లాడితే భౌతిక దాడులకు దిగడం జగన్ అండ్ కో బలహీనతకు సంకేతమని ఎద్దేవా చేశారు.
ఈ అరాచక సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ అని పిలిచే మీడియాపై ఇలాంటి దాడులు భవిష్యత్తులో రాజకీయ పార్టీల జవాబుదారీతనాన్ని ప్రశ్నార్థకం చేస్తాయన్నారు. విశ్లేషణ నచ్చకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాలి లేదా చట్టపరంగా ముందుకెళ్లాలని.. కానీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా రోడ్లపైకి వచ్చి దాడులను ప్రోత్సహించడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహించారు. వైసీపీ వైఫల్యాలు మభ్యపెట్టడం, గత పాలనలో జరిగిన తప్పిదాలను, ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి వేగాన్ని తట్టుకోలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ఇటువంటి దాడులకు దిగుతోందని రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
.
ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News

