హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (Telangana CM Revanth Reddy) నిమ్స్ వైద్యులు ఈరోజు (శనివారం) కలిశారు.
నిమ్స్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా వైద్యులు డి.రమణ ధన్నపునేని, ఎం.అమరేశ్ రావు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిమ్స్‌లో ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ క్యాంపును నిర్వహించారు. పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు క్యాంపులో శస్త్రచికిత్సలు చేశారు. ఇందులో కేవలం 2 కిలోల బరువు ఉన్న 2 నెలల పసికందుకి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి వైద్యులను అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ చేసింది వీరే.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ

