Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిర్లక్ష్యం వహిస్తే అంతే...!

నిర్లక్ష్యం వహిస్తే అంతే...!

- కరోనాపై వినూత్న అవగాహన ప్రచారం

పెరంబూర్‌(చెన్నై): కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే కరోనా వైరస్‌ బారిన పడక తప్పదని అధికారులు హెచ్చరిస్తూ చేపట్టిన వినూత్న అవగాహన ప్రచారం ఆకట్టుకుంటోంది. కొవిడ్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఆరోగ్యశాఖ, స్థానిక సంస్థలు సంయుక్తంగా ప్రచారం చేపడుతున్నారు. ఆ క్రమంలో, తేని జిల్లా పెరియకుళం మున్సిపాలిటీ కమిషనర్‌ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో కరోనా వైరస్‌ వేషధారణతో ఉన్న వ్యక్తి, మాస్కు ధరించకుండా వెళుతున్న వ్యక్తిని పట్టుకోవడం, అతను విగతజీవిలా మారిపోవడం వంటి సన్నివేశాలతో చేపట్టిన ప్రచారం ప్రజలను ఆలోచింపజేయడంతో పాటు ఆకట్టుకుంటోంది.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy