Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిర్మలా సీతారామన్‌తో భేటీ.. తెలంగాణకు అదనపు ఆర్థిక సాయం కోరిన భట్టి

నిర్మలా సీతారామన్‌తో భేటీ.. తెలంగాణకు అదనపు ఆర్థిక సాయం కోరిన భట్టి

న్యూఢిల్లీ, మే 20: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఏఎస్‌సీఐ (Scheme for Special Assistance to States for Capital Investment (SASCI) కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి వివరించారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్(YIIRS) సహా విద్యా రంగంలో చేపడుతున్న భారీ పెట్టుబడులకు సంబంధించి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్(DEA) ఆమోదించిన విదేశీ ద్రవ్య సహకార(EAP) ప్రాజెక్టులకు ఎఫ్‌ఆర్‌బీఎమ్(FRBM) పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy