Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీరు చుట్టుముట్టినా.. పిల్ల కోసం తల్లి కుక్క పోరాటం.. వీడియో వైరల్

నీరు చుట్టుముట్టినా.. పిల్ల కోసం తల్లి కుక్క పోరాటం.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: చుట్టూ వరద నీరు వేగంగా ప్రవహిస్తున్న సమయంలో ఓ తల్లి కుక్క తన పిల్లను కాపాడేందుకు చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చుట్టూ నీరు నిండిపోవడంతో సురక్షితమైన ప్రదేశం కోసం వెతికిన తల్లి కుక్క, తన పిల్లను వెంట తీసుకుని కారు పైకప్పుపైకి చేరుకుంది. భౌ భౌ అని అరుస్తూ కాపాడమని దీనంగా మొరగడం అందరి హృదయాలనూ కలచి వేస్తోంది.

తమ పిల్లలపై జంతువులకు ఉన్న ప్రేమకు నిదర్శనంగా అనేక సంఘటనలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో వరదలో తన పిల్ల కోసం తల్లి కుక్క పడిన ఆరాటాన్ని చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. తల్లి ప్రేమకు కులం, మతం, జాతి అనే తేడా ఉండదని.. బిడ్డను కాపాడే విషయంలో ప్రతి తల్లీ ఒకేలా స్పందిస్తుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. వరదలో కుక్క ఘటనలో చివరకు ఏమైందో తెలీదు గానీ.. పరిస్థితి చూస్తుంటే దాన్ని స్థానికులు కాపాడి ఉండొచ్చని తలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy