Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నితిన్ 'రంగ్ దే' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

నితిన్ 'రంగ్ దే' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

ఈ ఏడాది 'భీష్మ' చిత్రంతో మంచి హిట్ అందుకున్న హీరో నితిన్ తదుపరి సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఈయన హీరోగా 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రంగ్ దే'. మహానటితో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేశ్ హీరోయిన్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. సినిమా ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ విజువల్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy