Dailyhunt
న్యాయం, ఆర్థిక స్వావలంభనే లక్ష్యం

న్యాయం, ఆర్థిక స్వావలంభనే లక్ష్యం

భువనగిరి టౌన్‌, జనవరి 23: వివక్షకు గురవుతున్న మహిళలు, బాలలకు చట్టపరమైన న్యాయం, వారి ఆర్థిక స్వాలంభనకు తోడ్పాటునందించడమే 'సంఘమిత్ర' లక్ష్యమని రాచకొండ కమిషనరేట్‌ షీ టీం అడిషనల్‌ డీసీపీ సలీమా అన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ ఎం.భగవత్‌ మార్గదర్శకంలో రూపొందించిన వినూత్నమైన సంఘమిత్ర కార్యక్రమాన్ని శనివారం భువనగిరిలో ప్రారంభించి మాట్లాడారు. సంఘమిత్ర ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి, స్వీయ రక్షణ, మానవ అక్రమ రవాణా, హక్కులు, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పి.సైదులు, లతా, రమా, అర్చన, రజిని, భూమిక మాధవి, వెంకట్‌రెడ్డి, పట్టణ ఇన్స్‌పెక్టర్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy