Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకే బేసిన్‌లో.. ఇండియన్‌, వెస్టర్న్‌ టాయిలెట్‌

ఒకే బేసిన్‌లో.. ఇండియన్‌, వెస్టర్న్‌ టాయిలెట్‌

  • స్థలం, ఖర్చు ఆదా చేసే డిజైన్‌ రూపకల్పన

  • కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆవిష్కరణ

  • రైళ్లు, విమానాల్లో ఏర్పాటుకు అనుకూలం

రాయపోల్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కొందరికి ఇండియన్‌ టాయిలెట్‌ బేసిన్‌ అలవాటు.

వృద్ధాప్యం, మోకీలు, తుంటి సమస్యలతో కొందరు దాన్ని వినియోగించుకోలేని స్థితి. అలాంటి వారికి వెస్టర్న్‌ తరహా టాయిలెట్‌ బేసిన్‌ అనుకూలం. ఇళ్లల్లో అయితే, ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు ఏర్పాటు చేసుకుంటారు. కానీ రైళ్లు, విమానాలు వంటి స్థలం పరిమితంగా ఉన్నచోట.. ఈ రెండింటినీ వేర్వేరుగా ఏర్పాటు చేయడం కొంచెం కష్టమైన పని. ఈ సమస్యకు పరిష్కారంగా.. రెండు రకాలుగా వినియోగించుకునే ఒకే టాయిలెట్‌ బేసిన్‌ను రూపొందించారు సిద్దిపేట జిల్లా, రాయపోల్‌ మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. రైలులో ప్రయాణించేటప్పుడు ఈ రెండూ వేర్వేరుగా ఉండడం చూసి, ఈ ప్రయోగానికి రూపకల్పన చేశారు. ప్రధానోపాధ్యాయుడు నాగరాజు సూచనలతో.. నాలుగో తరగతి చదువుతున్న మండే లతకి ప్రియ, ఐదో తరగతి చదువుతున్న శ్రావణి కలిసి దీన్ని రూపొందించారు. రైళ్లు, విమానాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో ఇలాంటివి ఏర్పాటు చేయడం అనుకూలంగా ఉంటుందని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ డిజైన్‌ ద్వారా స్థలం, ఖర్చు ఆదా అవుతాయని వివరించారు.

ఇవీ చదవండి:

డిజిటల్‌ పేమెంట్లలో 'రంగారెడ్డి' రికార్డు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy