కోల్‌కతా : 'ఒకే దేశం- ఒకే రేషన్' విధానాన్ని అమలు చేయడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే.. అది ప్రక్రియలో ఉందని పేర్కొన్నారు. 'ఒకే దేశం- ఒకే రేషన్' విధానాన్ని బెంగాల్‌లో అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది వలస కూలీలకు సంబంధించిన అంశమని, దీనిని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం మమత పై విధంగా ప్రకటన చేశారు.
ఆంక్షలను పొడిగించిన సీఎం
కోవిడ్ దృష్ట్యా రాష్ట్రంలో అమలులో ఉన్న ఆంక్షలను జూలై 1 వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

