Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఒకేసారి ఎరువుల కొనుగోలుకు చెక్‌!

ఒక రైతుకు యూరియా నెలకు 50 బస్తాలే

కేంద్రం ప్రభుత్వం తాజా ఆదేశాలు

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): తాము సబ్సిడీ ఇస్తున్న ఎరువులను ఒకేసారి కొనుగోలు చేసే పద్ధతికి కేంద్ర ప్రభుత్వం చెక్‌ పెట్టింది. సబ్సిడీ ఇస్తున్న యూరియాను ఒక రైతు నెలకు 50 బస్తాలు మించి కొనడానికి వీలులేదు. ఈ మేరకుగురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎరువుల ధరలు పెరగొచ్చని లేదా మళ్లీ మళ్లీ డీలరు వద్దకు రాలేమనే ఉద్దేశంతో రైతులు సీజన్‌కు సరిపడా ఒకేసారి ఎరువులను కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. ఇది కూడా పంట సీజన్‌ మొదలైన సమయంలోనే ఉంటుంది. దీంతో ఒక్కోసారి కొరత ఏర్పడుతోంది. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా ఎరువులను అందించడం కూడా కష్టమవుతోంది.

ఈ నేపథ్యంలోనే రైతులు ఒకేసారి ఎరువులు కొనే విధానంపై కేంద్రం పరిమతి విధించింది. ఎరువుల విక్రయం ఇప్పటికే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) పద్ధతిలో సాగుతోంది. ఆధార్‌ అనుసంధానంతోనే రైతులకు ఎరువులు అందుతున్నాయి. యూరియాను సబ్సిడీ ధరపై కేంద్రం రైతులకు అందిస్తోంది. పొటాష్‌, ఫాస్పర్‌స(పీఅండ్‌కె) ఎరువులకూ ఇస్తున్నా ప్రధానంగా యూరియాకే సబ్సిడీ అందుతోంది. తాజా నిర్ణయం వల్ల మధ్యలో రేటు పెరిగితే ఆ భారం రైతుపైనే పడుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy