న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసుతోనే తగినంత రోగనిరోధక శక్తి సమకూరుతుందని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలిసింది. దీని ప్రకారం.. కొవిడ్ నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు కూడా రెండింటితో సమానమవుతుంది. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి జరపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్‌లో ఈ అధ్యయనం తాలూకు వివరాలు ఇటీవలే ప్రచురితమయ్యాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కోవిషీల్డ్ టీకా తీసుకున్న 260 హెల్త్ వర్కర్లలో రోగనిరోధక శక్తి స్థాయిలను అధ్యయనకారులు పరిశీలించి ఈ అంచనాకు వచ్చారు. కొవిడ్ సోకని వారికంటే వ్యాధి నుంచి కోలుకున్న వారిలో టీ, బీ రోగనిరోధక కణాల స్పందనలు అధికంగా ఉన్నాయని వారు గుర్తించారు.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

