Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటమి బాధలో ఉన్న సీఎస్కేకు మరో బిగ్ షాక్

ఓటమి బాధలో ఉన్న సీఎస్కేకు మరో బిగ్ షాక్

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గురువారం గుజరాత్ టైటాన్స్ చేతిలో 89 పరుగుల భారీ తేడాతో చెన్నై ఓడింది.

ఇది చెన్నై ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద ఓటముల్లో ఒకటి కావడం గమనార్హం. గుజరాత్ చేతిలో ఓటమితో ఈ సీజన్ నుంచి సీఎస్కే ఔటైంది. ఇలా ఓటమి బాధలో ఉన్న చెన్నైకు మరో బిగ్ షాక్ తగిలింది.

స్లో ఓవర్ రేట్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు జట్టులోని మిగిలిన సభ్యులకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఇది వారికి రెండో స్లో ఓవర్ రేట్ కావడం గమనార్హం. ఈ ఉల్లంఘన కారణంగా కెప్టెన్ గైక్వాడ్‌పై రూ.24 లక్షలు జరిమానా పడింది. అలానే మిగతా ప్లేయింగ్ ఎలెవన్, ఇంపాక్ట్ ప్లేయర్ కార్తీక్ శర్మపై రూ.6 లక్షలు జరిమానా పడింది.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయడంలో చెన్నై జట్టు విఫలమైంది. స్లో ఓవర్ రేట్‌ను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు రూ. 24 లక్షల భారీ జరిమానా విధించింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సీజన్‌లో చెన్నై జట్టు ఇలా స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి. ఈ సీజన్18వ మ్యాచ్‌లోనూ సీఎస్కే తొలిసారి ఉల్లంఘనకు పాల్పడింది.

ఓవర్ రేట్ తప్పిదం తొలిసారి అయితే కెప్టెన్‌కు మాత్రమే జరిమానా విధిస్తారు. కానీ ఈ సీజన్‌లో సీఎస్కే జట్టుకు గుజరాత్ మ్యాచ్ లో జరిగినది రెండో ఓవర్ రేట్ తప్పిదం. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం కేవలం కెప్టెన్‌పైనే కాకుండా జట్టు మొత్తంపైన కఠినమైన చర్యలు తీసుకున్నారు. తుది జట్టులో ఆడిన మిగిలిన 10 మంది ఆటగాళ్లతో పాటు, మ్యాచ్‌లో ఉపయోగించిన 'ఇంపాక్ట్ ప్లేయర్'పై కూడా ఐపీఎల్ కౌన్సిల్ జరిమానా వేసింది. దీంతో ఓటమి బాధలో ఉన్న చెన్నై క్యాంప్‌కు ఈ భారీ పెనాల్టీ కోలుకోలేని దెబ్బగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy