Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి

ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి

బెజ్జూరు, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో గురువారం సర్‌పై గ్రామసభలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా పంచాయతీల్లో ఓటర్ల జాబితా వివరాలు చదివి వినిపించారు. తప్పిపోయిన వారి పేర్లు గుర్తించారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ కొత్తగా ఓటు నమోదు కోసం అవకాశం ఉందని చెప్పారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఫారం-6ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఓటరు జాబితాను పరిశీలించి అవసరమైన సవరణలుంటే సంబంధిత బీఎల్‌వవో77లకు తెలియజేయాలని రాజంపేట సర్పంచ్‌ బుర్స పోచయ్య అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది సంతోష్‌, వార్డు సభ్యులు జావేద్‌, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని గౌరి, భుసిమెట్ట, పవర్‌గూడ, గౌరి తదితర గ్రామ పంచాయతీలలో గురువారం సర్పంచుల అధ్యక్షతన సర్‌ కార్యక్రమంపై గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌ పాల్గోని ప్రజలకు ఓటుపై ఆవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం అయ్యుబాయి భుజంగ్‌రావ్‌, దుర్వ సింధు నగేష్‌లలు మాట్లాడారు. ప్రజాస్వామాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటు కీలకమవుతుందన్నారు. అంతకు ముందు ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy