Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాలకు ఇబ్బందులు

ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాలకు ఇబ్బందులు

సిరిసిల్ల టౌన్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ఓటు హక్కు కోల్పేతే ప్రభుత్వ సం క్షేమ పథకాలు రావడం ఇబ్బందిగా మారుతుందని, బీఎల్‌వో ఇచ్చిన ఫారాన్ని పట్టణ ప్రజలందరు ఆగస్టు 3 వరకు నింపి బీఎల్‌వోకు ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

శుక్రవారం స్థానిక పద్మశాలి కల్యా ణ భవన్‌లో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు అధ్యక్షతన మున్సిపల్‌ పరిధిలోని 3, 16, 28 వార్డుల నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్‌, గ్రంథాలయం చైర్మన్‌ నాగుల సత్యనారాయ ణ మాట్లాడారు. పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో ఆగస్టు 3లోపు సర్‌ కార్యక్ర మాలను పూర్తిచేయాలని సూచించారు. పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులైన పేద ప్రజలకు అందేలా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బాధ్యతలను తీసుకోవాలన్నారు.

ఇళ్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. గత ప్రభుత్వాలు హామీలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల ఆదరణను అందుకుంటుందన్నారు. ఈ సమావేశం లో సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాముని వనితనళినీకాంత్‌, చేనేత సెల్‌ అధ్యక్షుడు గుడిశెట్టి బాలరాజు, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ వైస్‌చైర్మన్‌ నీలి రవీందర్‌, నాయకులు శ్రీగాధ మైసయ్య, గుజ్జె రమేష్‌, భాస్కర్‌, దేవదాస్‌, శివ, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy