Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటు హక్కు నమోదుకు 14,133 దరఖాస్తులు

ఓటు హక్కు నమోదుకు 14,133 దరఖాస్తులు

-విజయనగరం నియోజకవర్గంలో తగ్గిన దరఖాస్తులు

-ఈనెల 10 వరకూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం

-అక్టోబరు 9న తుది జాబితా

విజయనగరం, కలెక్టరేట్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఓటు హక్కు నమోదుకు ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 14,133 దరఖాస్తులు వచ్చాయి.

జూలై 31 నుంచి ఇప్పటి వరకూ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు నమోదు కోసం బీఎల్వోలకు ఈ దరఖాస్తులు అందాయి. ఈనెల 10 వరకూ ఈ కార్యక్రమం పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ మంగళవారం తెలిపారు. యువత నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఓటు హక్కు నమోదుకు పెద్దగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ రోణంకి గోపాలకృష్ణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో సమారు 82 వేలమంది యువ ఓటర్లను కొత్తగా జాబితాలో చేర్పించాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సంబంధించిన అధికారులకు సూచించారు. అయినా జిల్లాలో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు. గత నెల రోజుల పాటు నిర్వహించిన సర్‌ కార్యక్రమంలో ఓటు హక్కు నమోదుకు 14,133 దరఖాస్తులు, తొలగింపు కోసం 1128, చేర్పులు మార్పుల కోసం 3,899 దరఖాస్తులు అందాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో ఓటు హక్కు కోసం అత్యధికంగా 3,277 దరఖాస్తులు, విజయనగరం నియోజకవర్గంలో అత్యల్పంగా 1240 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి అక్టోబరు 9న తుది జాబితా విడుదల కానుంది.

ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువు ఈనెల 10 వరకూ పొడిగించినట్లు కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నోటీసుల పరిష్కారం అక్టోబరు 5 వరకూ జరుగుతుందని, తుది జాబితా అక్టోబరు 9న ప్రచురించనున్నట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy