Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

కాకినాడ జిల్లా: వినాయక చవితి వేళ ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాదగయ పుష్కరిణిలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు.

పిఠాపురం మండలం కొత్త కందరాడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున దర్శనం నిమిత్తం పాదగయకు వెళ్లారు.

దర్శనానికి ముందు పుణ్యస్నానాలు ఆచరించేందుకు పుష్కరిణిలో దిగారు. అయితే, ప్రమాదవశాత్తూ సాయి (22) అనే యువకుడు గల్లంతయ్యాడు. స్నానం చేస్తుండగా కాలు జారడంతో లోపలికి పడిపోయాడు. స్థానికులు, యువకుడి స్నేహితుల సమాచారంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ వేళ ఆలయ పుష్కరిణిలో యువకుడు గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ వార్తలు కూడా చదవండి

విఘ్ననాశాయా.. వినాయకాయా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy