Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్ చెత్త రికార్డు.. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో పరాజయం

పాకిస్థాన్ చెత్త రికార్డు.. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో పరాజయం

స్పోర్ట్స్ డెస్క్: టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో టెస్టులో పరాజయంపాలై, ఆ ఫార్మాట్‌లో తమ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ఓటముల పరంపరను నమోదు చేసింది.

ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 90 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ తాజా ఓటమితో విదేశాల్లో పాక్ రెడ్ బాల్ క్రికెట్ ప్రదర్శన ఎంతగా దిగజారిందో మరోసారి స్పష్టమైందని క్రీడా నిపుణులు అంటున్నారు.

వెస్టిండీస్‌తో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో 211 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ తడబడి కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. చాలా ఏళ్ల తర్వాత తిరిగి కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజమ్ (అజేయంగా 58) ఒక్కడే పోరాడగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 8 మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ (5/20) అద్భుతమైన బౌలింగ్‌తో పాక్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు కీమర్‌ రోచ్‌, గ్రీవ్స్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

2023 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనతో ప్రారంభమైన పాకిస్థాన్ పరాజయాల పరంపర నిరంతరంగా కొనసాగుతోంది. ఆసీస్ గడ్డపై 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన పాక్, ఆ తర్వాత దక్షిణాఫ్రికాలోనూ రెండు టెస్టుల్లోనూ ఓటమి చవిచూసింది. ఇక 2026 మే నెలలో బంగ్లాదేశ్‌పై జరిగిన రెండు టెస్టుల్లోనూ పరాజయం పాలైంది. తాజా విండీస్ పర్యటనలోని తొలి టెస్టు ఓటమితో ఈ చెత్త రికార్డు నమోదైంది.

ఆస్ట్రేలియా (3), దక్షిణాఫ్రికా (2), బంగ్లాదేశ్ (2), వెస్టిండీస్ (1).. ఇలా విదేశీ పిచ్‌లపై పాక్ జట్టు ఒక్క గెలుపు కూడా నమోదు చేయలేకపోయింది. కీలక ఆటగాళ్లు విఫలమవడం, వ్యూహాత్మక లోపాలు పాక్ జట్టును వెంటాడుతున్నాయి. విదేశీ గడ్డపై విజయాల కోసం పాకిస్థాన్ జట్టు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందని ఈ ఓటములు మరోసారి నిరూపించాయి. ఇక ఈ ఓటమితో పాక్‌ జట్టు (6.66% పీసీటీ) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పడిపోయింది.

విదేశీ గడ్డపై పాకిస్థాన్ వరుసగా టెస్ట్ ఓటములు:

  • ఆస్ట్రేలియా, పెర్త్ (డిసెంబర్ 2023) - 360 పరుగుల తేడాతో ఓటమి

  • ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్ (డిసెంబర్ 2023) - 79 పరుగుల తేడాతో ఓటమి

  • ఆస్ట్రేలియా, సిడ్నీ (జనవరి 2024) - 8 వికెట్ల తేడాతో ఓటమి

  • దక్షిణాఫ్రికా, సెంచూరియన్ (డిసెంబర్ 2024) - 2 వికెట్ల తేడాతో ఓటమి

  • దక్షిణాఫ్రికా, కేప్ టౌన్ (జనవరి 2025) - 10 వికెట్ల తేడాతో ఓటమి

  • బంగ్లాదేశ్, ఢాకా (మే 2026) - 104 పరుగుల తేడాతో ఓటమి

  • బంగ్లాదేశ్, సిల్హెట్ (మే 2026) - 78 పరుగుల తేడాతో ఓటమి

  • వెస్టిండీస్, ట్రినిడాడ్ (జూలై 2026) - 90 పరుగుల తేడాతో ఓటమి

strong>

కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..

ఆ మాటలు వైభవ్‌ను అవమానించినట్లు కాదు: అశ్విన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy