Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్ క్రికెటర్‌కు బిగ్ షాక్.. రెండేళ్లు నిషేధం

పాకిస్థాన్ క్రికెటర్‌కు బిగ్ షాక్.. రెండేళ్లు నిషేధం

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. యువ ఆల్ రౌండర్ హంజా నజర్‌పై రెండేళ్ల నిషేధాన్ని విధించింది. వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించినందుకు పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.

అలానే బోర్డు రూ.10 లక్షల జరిమానాను విధించింది. ఈ తప్పుడు సమాచారం పాకిస్థాన్ క్రికెట్ ప్రమాణాలకు విరుద్ధమని పీసీబీ పేర్కొంది.

నజర్‌పై నిషేధం విధించే ముందు అతడు సమర్పించిన సమాచారంపై విచారణ జరిపేందుకు పీసీబీ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణలో నజర్ పీసీబీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక బోర్డు విధించిన రెండేళ్ల నిషేధ కాలంలో నజర్ ఎలాంటి క్రికెట్ టోర్నీల్లో పాల్గొనకూడదు. 31 ఏళ్ల హంజా ఇంకా పాకిస్థాన్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయలేదు.

అయితే దేశవాళీ మ్యాచుల్లో నజర్ అద్భుతంగా రాణించి గుర్తింపు సంపాదించాడు. రెడ్‌బాల్ క్రికెట్‌లో నజర్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 175గా ఉంది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ టూర్‌కు అతడు పాక్ తరఫున వెళ్లాల్సి ఉంది. కానీ ఈ వీసా వివాదం కారణంగా అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. మొత్తంగా అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ పీసీబీ నిబంధనలను ఉల్లంఘించడంతో నజర్ కెరీర్ సందిగ్ధంలో పడింది.

strong>

వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్

8 ఏళ్ల తర్వాత.. టోర్నీలో భారత అంపైర్‌కు నో ఛాన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy