Dailyhunt
పాకిస్థాన్‌లో ట్రైన్-వ్యాన్ ఢీ.. 15 మంది సిక్కు యాత్రికులు మృతి

పాకిస్థాన్‌లో ట్రైన్-వ్యాన్ ఢీ.. 15 మంది సిక్కు యాత్రికులు మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ఫరూఖాబాద్‌లో రైలు వ్యాన్‌ను ఢీ కొట్టిన ఘటనలో 15మంది సిక్కు యాత్రికులు చనిపోయారు. లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫరూఖాబాద్‌ రైల్వే క్రాసింగ్ వద్ద వ్యాన్‌ను ఢీకొట్టింది. నన్‌కానా సాహిబ్ నుంచి యాత్రికులు తిరుగుప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy