కాబూల్ : పాకిస్థాన్‌లోని ఆఫ్ఘనిస్థాన్ దౌత్య కార్యాలయాల్లో తాలిబన్లు దౌత్యవేత్తల నియామకాలను ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాకీ ఈ నియామకాలను చేపట్టారు.
ఇదిలావుండగా ఈ వార్తలను తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఖండించలేదు. అయితే ఈ వార్తల్లో యథార్థం ఉందో, లేదో సరిచూస్తామని చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్‌ను ఆగస్టులో తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశం సంక్షోభంలో ఉంది. హసన్ అఖుండ్ ఆధ్వర్యంలో కేర్‌టేకర్ గవర్నమెంట్ ఏర్పాటైంది. హసన్ అఖుండ్ 2001 నుంచి ఐక్యరాజ్య సమితి ఆంక్షల పరిధిలో ఉన్నారు. తాలిబన్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశమూ గుర్తించలేదు.
అఫ్ఘాన్ సుస్థిర భవిష్యత్తులో.. భారత్ సహా ఆ దేశాలకు భాగస్వామ్యం: బైడెన్
Afghanistan: తాలిబాన్లే లక్ష్యంగా బాంబుపేలుళ్లు
POKలో యురేనియం కోసం పాక్ అక్రమ తవ్వకాలు
పాకిస్థాన్ మా రెండో ఇల్లు : తాలిబన్లు

