Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. నేడు బర్మింగ్‌హామ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత మహిళలు తలపడనున్నారు.

ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఆసియా కప్ నుంచి ఇరు జట్లు 'నో హ్యాండ్‌షేక్' విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే నేటి మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది. ఆమె దానికి ఘాటుగా సమాధానమిచ్చింది.

'మేము ఇక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చాం. క్రికెట్ తప్ప మరో అంశం గురించి మాట్లాడే ఉద్దేశం మాకు లేదు. ఆదివారం జరిగే భారత్-పాక్ మ్యాచ్‌ను కూడా సాధారణ మ్యాచ్‌లాగే చూస్తున్నాం. రాజకీయ అంశాలను పక్కన పెట్టి ఆటను ఆటలాగా చూడండి. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే అంచనాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఆ ఒత్తిడిని ఆస్వాదిస్తూ అత్యుత్తమ ఆటను ప్రదర్శించడమే మా లక్ష్యం. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి మ్యాచ్‌కీ ఒత్తిడి ఉంటుంది. దాన్ని ఎలా ఎదుర్కొంటామనేదే ఇక్కడ ముఖ్యం. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. మైదానంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం' అని హర్మన్ వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy