Tuesday, 28 Sep, 11.13 pm ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
పామాయిల్‌ గెలలు ఏపీకి తరలిస్తే చర్యలు

సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం

ఆయిల్‌పామ్‌ రైతుల సమావేశంలో తహసీల్దార్‌, ఎంవీఐ

అశ్వారావుపేట, సెప్టెంబర్‌ 28: పామాయిల్‌ గెలలను అక్రమంగా ఏపీకి తరలిస్తే కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్‌ చల్లా ప్రసాదరావు, ఎంవీఐ జయపాల్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ చల్లా ప్రసాదరావు ఆధ్వర్యంలో రవాణా, పోలీస్‌, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు, పామాయిల్‌ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐ, తహసీల్దార్‌ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఏ కంపెనీ పరిధిలో వేసిన గెలలను వారికే రైతులు విక్రయించాలన్నారు. అందుకు భిన్నంగా పలువురు రైతులు గెలలలను ఏపీకి తరలిస్తున్నారని, అదే విధంగా ఏపీ గెలలను తెలంగాణకు తెస్తున్నట్టు గుర్తించామన్నారు. ఇది చట్ట ప్రకారం నేరమని, ఇక నుంచి గెలలు సరిహద్దులు దాటితే చర్యలు తీసుకుంటామన్నారు. రవాణాను అరికట్టేందుకు సరిహద్దు చెక్‌పోస్టులతో పాటు ఇతర మార్గాలలో నిఘాను ఏర్పా టు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో సీఐ ఉపేందరారావు, అసిస్టెంట్‌ ఎంవీఐ పారూఖ్‌, దమ్మపేట తహసీల్దార్‌ రంగ ప్రసాద్‌, అశ్వారావుపేట, దమ్మపేట పామాయిల్‌ ఫ్యాక్టరీల మేనేజర్లు బాలకృష్ణ, శ్రీకాంత్‌రెడ్డి, ఆయిల్‌పామ్‌ సంఘం నాయకులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్‌, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top