Dailyhunt
పాండ్యా, మోరి్‌సకు మందలింపు

పాండ్యా, మోరి్‌సకు మందలింపు

అబుదాబి: క్రమశిక్షణను ఉల్లంఘించిన బెం గళూరు ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌, ముంబై ఆటగాడు హార్దిక్‌ పాండ్యాను మ్యాచ్‌ రెఫరీ మందలించాడు. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మోరిస్‌ వేసిన 19వ ఓవర్‌లో సిక్స్‌ బాదిన పాండ్యా.. అతడిని ఉద్దేశించి హెచ్చరికగా మాట్లాడుతూ సంజ్ఞలు చేశాడు. అయితే, అదే ఓవర్‌లో పాండ్యాను అవుట్‌ చేసిన మోరిస్‌ ఇక వెళ్లు... అన్నట్టుగా వ్యవహరించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటలు చోటు చేసుకున్నాయి. పాండ్యా, మోరిస్‌ తమ తప్పిదాలను అంగీకరించారని ఐపీఎల్‌ తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy