Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ సీఎం జగన్ అబద్ధాలు

పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ సీఎం జగన్ అబద్ధాలు

అమరావతి: పార్లమెంట్ సాక్షిగా సీఎం జగన్ అబద్ధాలు బయటపడ్డాయి. పోలవరం అంచనాలపై కేంద్రమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి మాట్లాడలేదని తేలిపోయింది. జనవరి 19న అమిత్ షాను కలిసినప్పుడు పెరిగిన పోలవరం అంచనాలను ఆమోదించాలని కోరినట్లు ప్రభుత్వం పత్రిక ప్రటకన విడుదల చేసింది. అయితే అలాంటి మెమొరాండం హోంశాఖకు ఇవ్వలేదని పార్లమెంట్‌లో జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్ లాల్ తెలిపారు.

సీఎం జగన్ ఢిల్లీకి వచ్చి పెద్దలను కలిసి లోపల ఏం మాట్లాడుతున్నారు.. బయటకొచ్చి ఏం చెబుతున్నారో అన్నది ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా మరోసారి బయటపడింది. జగన్ కేంద్రానికి ఇచ్చిన మెమొరాండాలను ఎప్పుడు పత్రికలకు విడుదల చేయరు. కానీ సీఎంవో, ఇతర వ్యక్తుల నుంచి మాత్రం ప్రటకనలు వస్తాయి.

ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పెద్దలను కలిసి మాట్లాడారని ప్రకటనలు ఇస్తారు. ఈ విషయంలో అనేకసార్లు అనేక సందేహాలు వచ్చాయి.

సీఎం జగన్ జనవరి 19న, ఫిబ్రవరి 19న అమిత్‌ షాను కలిశారని, పోలవరంకు సంబంధించి పెరిగిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని ఇవాళ పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. దీనికి సమాధానంగా జలశక్తి సహాయం మంత్రి రతన్ లాల్ మాట్లాడుతూ అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని, మెమొరాండం కూడా జగన్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy