హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ట్రక్ యజమానుల కోసం దైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ (డీఐసీవీ) 'భారత్ బెంజ్ ఎక్స్ఛేంజ్' ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద ఏ కంపెనీకి చెందిన వాణిజ్య వాహనానైనా ఇచ్చి కొత్త లేదా వాడిన భారత్ బెంజ్ వాహనాన్ని తీసుకోవచ్చు. పాత వాహనాలను విక్రయించాలనుకునే వారికి సరైన ధర అందించడానికి, భారత్ బెంజ్ వాణిజ్య వాహనాల యజమానులను పెంచడానికి ఈ ఆఫర్ దోహదం చేస్తుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాజారామ్ కృష్ణమూర్తి తెలిపారు.
