Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాతబస్తీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

పాతబస్తీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, మే 21: పాతబస్తీలో మదీనా సమీపంలోని ఎస్‌వైజే కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఈ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి.

దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఎస్‌వైజే కాంప్లెక్స్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని కీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 100కు పైగా దుకాణాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రహదారిపై భారీగా అగ్నిమాపక వాహనాలు నిలిచి ఉండడంతో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. దానిని క్లియర్ చేస్తున్నారు. ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. దీంతో భారీగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy