Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాఠశాలలు తెరిచే నిర్ణయాన్ని మార్చుకోవాలి: షర్మిల

పాఠశాలలు తెరిచే నిర్ణయాన్ని మార్చుకోవాలి: షర్మిల

హైదరాబాద్: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు తెరిచే నిర్ణయాన్ని మార్చుకోవాలని వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్‌ను కోరారు. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిఫుణులు హెచ్చరిస్తున్నారన్నారు. ఒకవైపు ప్రజలకు ఇంకా వ్యాక్సినేషన్ ప్ర్ర్రక్రియ పూర్తి కాలేదన్నారు. థర్డ్ వేవ్ పిల్లలపైనే ప్రమాదం అని వైద్యులు చెప్తున్నారని.. ఇలాంటి సమయంలో బడులు తెరిచి విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దని సూచించారు. ప్రజలందరికి వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే పాఠశాలలు తెరవాలని షర్మిల హితవు పలికారు.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy