Friday, 16 Apr, 4.49 am ఆంధ్రజ్యోతి

బిజినెస్
పదిహేను రోజుల్లో... మళ్ళీ తగ్గిన పెట్రో ధరలు...

న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు మరోమారు తగ్గాయి. చమురురంగ సంస్థలు పదిహేను రోజుల పాటు ధరలను సవరించని విషయం తెలిసిందే. తాజాగా,,, ఈ రోజు(ఏప్రిల్ 15, గురువారం) మాత్రం ధరలను స్వల్పంగా తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. ఈ క్రమంలో... దేశీయ చమురురంగ సంస్థలు కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరించాయి.

ఈ నేపధ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 16 పైసలు తగ్గి రూ. 90.40 కు, డీజిల్ లీటర్ 14 పైసలు తగ్గి రూ. 83.73 చేరుకున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.83, డీజిల్ రూ. 87.81 గా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ పై వివిధ రకాల పన్నులుంఉంటాయన్న విషయం తెలిసిందే.

ఇక ఈ క్రమంలో ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.83, డీజిల్ రూ. 87.81, చెన్నైలో పెట్రోల్ రూ. 92.43, డీజిల్ రూ. 85.75, కోల్‌కతాలో పెట్రోల్ రూ. 90.62, డీజిల్ రూ. 83.61గా ఉన్నాయి. భారత చమురురంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం సంస్థలు ధరలను తగ్గించాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top