ఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఫుకెట్ - ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) స్పందించారు.
ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు. విమానం డేటా రికార్డర్లు, ఇతర భాగాలు సురక్షితంగా ఉన్నందున, త్వరలోనే ప్రాథమిక నివేదిక వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పైలట్లు మాదకద్రవ్యాల, మత్తు పదార్థాలు ఉపయోగించకుండా అరికట్టేందుకు, భవిష్యత్తులో కఠినమైన నిబంధనలు తెచ్చేందుకు డీజీసీఏ ప్రస్తుతం విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం పైలట్ నెట్‌వర్క్‌లో కేవలం పదిశాతం మందికి మాత్రమే రాండమ్‌గా డోప్ టెస్టులు నిర్వహిస్తున్నారని రామ్మోహన్ వెల్లడించారు. ప్రతీ పైలట్‌కు సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా రాండమ్‌గా పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. విమాన ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. విమాన సంస్థల ఆపరేషనల్ ప్రభావం కూడా దెబ్బతినకుండా ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటిస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...

