Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పైథాన్‌ను ఇట్టే పట్టేసి.. చేతికి చుట్టేసిన ఐటీ ఉద్యోగి.!

పైథాన్‌ను ఇట్టే పట్టేసి.. చేతికి చుట్టేసిన ఐటీ ఉద్యోగి.!

ఇంటర్నెట్ డెస్క్: భాగ్యనగరంలోని దుర్గం చెరువు వీధుల్లో గురువారం(సెప్టెంబర్ 17న) ఓ భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. దీంతో అక్కడి ఐటీ ఉద్యోగులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు.

ఇంతలో అక్కడకు వచ్చిన ఓ ఐటీ ఉద్యోగి చాకచక్యంగా దాన్ని పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

వైరల్ అయిన వీడియోలో.. ఓ ఐటీ కంపెనీ ఎదుట పైథాన్‌(కొండచిలువ) కనిపించగా.. చాలా సింపుల్‌గా పట్టుకున్నాడా ఐటీ ఉద్యోగి. ఇదంతా చూస్తూ అక్కడివారు షాక్‌కు గురవ్వగా.. ఇంతలో దానిని తన చేతికి చుట్టుకుని నింపాదిగా నడుస్తూ వస్తున్నాడు. ఆపై తన మిత్రుడితో కలిసి దాన్ని బైక్ మీద తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాల్లో వదిలేసి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ వ్యక్తి ఒక్కసారిగా అక్కడివారి దృష్టిని ఆకర్షించాడు. సామాజిక మాధ్యమాల్లో సంబంధిత దృశ్యాలు వైరల్ కావడంతో.. నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

35 వేల అడుగుల ఎత్తులో.. బొజ్జ గణపయ్య దర్శనం!.. వీడియో వైరల్

రూ.505కే విమానం తరహా ప్రయాణం.. కేరళలో లగ్జరీ బస్సు వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy