Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంచ్‌.. 'సిక్సర్‌'

పంచ్‌.. 'సిక్సర్‌'

దిరే ప్రదర్శన చేస్తున్న భారత బాక్సర్లు.. మరో 6 పతకాలను ఖాయం చేశారు. జాస్మిన్‌ లంబోరియా, సాక్షి చౌదరి, అంకుశ్‌ పంగల్‌, అరుంధతి చౌదరి, సచిన్‌ సివాచ్‌, నరేందర్‌ బెర్‌వాల్‌ సెమీస్‌ చేరారు.

మహిళల 51 కిలోల క్వార్టర్స్‌లో సాక్షి 5-0తో కౌట్లిన్‌ ఫ్రయర్‌ (నార్థ్రన్‌ ఐర్లాండ్‌)ను, 70 కిలోల కేటగిరీలో అరుంధతి 3-1తో మోర్గాన్‌ హెండర్సన్‌ (న్యూజిలాండ్‌)ను, 57 కిలోల్లో జాస్మిన్‌ 4-1తో ఎలిస్‌ గ్లిన్‌ (ఇంగ్లండ్‌)ను ఓడించారు. పురుషుల 60 కిలోల విభాగం క్వార్టర్స్‌లో సచిన్‌ 5-0తో ట్రెజర్‌ మోర్మీ (బోట్సు వాన)పై, 80 కిలోల్లో అంకుశ్‌ 5-0తో జేడ్‌ (సీషెల్స్‌)పై, 90+ కిలోల్లో నరేందర్‌ 3-2తో మైకేల్‌ (సమోవా)పై నెగ్గారు. లవ్లీనా (75 కి), ప్రియ (60 కి), ప్రీతి (54 కి), జాదూమణి (55 కి) ఇప్పటికే సెమీస్‌ చేరడంతో భారత్‌కు మొత్తం 10 పతకాలు ఖరారయ్యాయి.

trong>

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy