Dailyhunt
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా.. అడ్వకేట్‌కు డ్రంకెన్ టెస్ట్

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా.. అడ్వకేట్‌కు డ్రంకెన్ టెస్ట్

హైదరాబాద్‌, ఏప్రిల్13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖ గాయని మంగ్లీ కేసుకు (Mangli Case) సంబంధించి..

ఫిర్యాదు చేయడానికి వచ్చిన అడ్వకేట్‌కు, పోలీసులకు మధ్య జరిగిన ఘటన హైడ్రామాగా మారింది. మంగ్లీ కేసులో బాధితుల తరఫున ఫిర్యాదు ఇవ్వడానికి అడ్వకేట్ సుబ్బారావు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే బాధితులను వెంట తీసుకుని వస్తేనే ఫిర్యాదు స్వీకరిస్తామని ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.

మద్యం అనుమానం..

ఈ సమయంలో అడ్వకేట్ సుబ్బారావు ప్రవర్తనపై ఇన్‌స్పెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మద్యం సేవించారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు డ్రంకెన్ టెస్ట్ చేయాలని నిర్ణయించారు. టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత, వాగ్వాదం చోటుచేసుకుంది.

డ్రంకెన్ టెస్ట్ ఫలితం..

చివరికి పోలీసులు అడ్వకేట్‌కు డ్రంకెన్ టెస్ట్ నిర్వహించారు. ఆ టెస్ట్‌లో 27 పాయింట్లు నమోదైనట్లు సమాచారం. అడ్వకేట్ సుబ్బారావు కూడా తాను నిన్న(ఆదివారం) రాత్రి మద్యం సేవించినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. అక్కడికి వచ్చిన ఇతరులు కూడా ఈ పరిణామాలను గమనించారు.

పోలీసుల వైఖరి..

తమ విధి నిర్వహణలో భాగంగా నియమ, నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం. స్టేషన్‌లోకి వచ్చే వ్యక్తులు సక్రమంగా ఉండాలని భావించి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మంగ్లీ కేసు నేపథ్యంలో జరిగిన ఈ పరిణామం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

మంగ్లీ కేసును పక్కదారి పట్టించడానికే డ్రంకెన్ టెస్ట్: న్యాయవాది సుబ్బారావు

మంగ్లీ కేసును పక్కదారి పట్టించడానికే డ్రంకెన్ టెస్ట్ చేస్తున్నారని న్యాయవాది సుబ్బారావు ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్‌లోకి వచ్చే వారందరికి ఇలాగే టెస్ట్ చేస్తారా..? అని న్యాయవాది సుబ్బారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. టాపిక్‌ను డైవర్ట్ చేయడం కోసమే డ్రంకెన్ టెస్ట్ చేస్తున్నారని పోలీసులపై ఫైర్ అయ్యారు. పంజాగుట్ట పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని న్యాయవాది సుబ్బారావు అసహనం వ్యక్తం చేశారు.

.

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం శరవేగంగా చర్యలు: మంత్రి ఉత్తమ్

కవిత సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించొద్దు: కేటీఆర్

జననాయగన్ కేసులో సైబర్ క్రైమ్ టీమ్ కీలక పురోగతి

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy