Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంటలకు జీవం పోసిన వర్షం

పంటలకు జీవం పోసిన వర్షం

చాగలమర్రిలో 18.2 మి.మీ.లు, రుద్రవరంలో 22.2 మి.మీ.లు ఫ కళకళలాడుతున్న పంటలు

చాగలమర్రి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది.

18.2 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారి అబ్దుల్‌సత్తార్‌ తెలిపారు. ఈ వర్షం మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర, పసుపు పంటలకు జీవం పోసింది. ఎల్‌నినో ప్రభావంతో నెల నుంచి బెట్టకు గురైన తరుణంలో వర్షం కురవడంతో మొక్కలు పచ్చగా కనిపిస్తున్నాయని, పొలాల్లో విత్తనాలు వేసేందుకు భూమి పదును అయిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

రుద్రవరం: మండలంలో సోమవారం రాత్రి 22.2 మి.మీ. వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. శ్రీరంగాపురం, డి.కొట్టాలు, చిన్నకంబలూరు గ్రామాల సమీపంలోని కోడిపిల్లవాగు, కొండవాగు పొంగి వాడుబట్టిన పంటలకు వర్షం ప్రాణం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy